నేను కింగ్ నే... కింగ్ మేకర్‌ని కాదు: విజయ్
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:22 AM
‘తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను కింగ్ నే అవుతా... కింగ్ మేకర్‌ని కాదు. ఎన్నికల్లో మా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. రాష్ట్రాన్ని పాలిస్తుంది’ అని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత...
చెన్నై, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను కింగ్ నే అవుతా... కింగ్ మేకర్‌ని కాదు. ఎన్నికల్లో మా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. రాష్ట్రాన్ని పాలిస్తుంది’ అని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత, నటుడు విజయ్ ప్రకటించారు. ఓ ఆంగ్ల టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గతేడాది కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందిన ఘటన మిగిల్చిన విషాదం నన్నింకా వెంబడిస్తూనే ఉంది’’ అన్నారు. ‘‘జననాయగన్’ చిత్రం విడుదలకు రాజకీయపరమైన ఆటంకాలు ఎదురవుతాయని నేను ముందే ఊహించా. అయితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితే నాకు ఆదర్శం’ అని విజయ్ అన్నారు.