నేవీ వైస్ చీఫ్‌గా అజయ్ కొచ్చర్ బాధ్యతలు
ABN , Publish Date - May 30 , 2026 | 03:13 AM
భారత నావికాదళ 48వ వైస్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం...
న్యూఢిల్లీ, మే 29: భారత నావికాదళ 48వ వైస్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో అత్యున్నత స్థాయి నేవీ పోరాట సన్నద్ధతను ఆయన పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి యుద్ధ రంగంలో కొచ్చర్‌కు ఉన్న అపార అనుభవాన్ని ఇకపై నేవీ ప్రధాన కార్యాలయంలో వినియోగించుకోనున్నారు. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అనేది భారత నావికాదళంలో రెండో అత్యున్నత స్థాయి పదవి. అజయ్ కొచ్చర్ ఇంతకుముందు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (ఏఎన్‌సీ)కు కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.