Share News

ఈ ఏడాది 254మంది హిందువుల హత్య: వీహెచ్‌పీ

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:53 AM

హిందువులపై మతపరమైన ప్రేరేపిత దాడుల కేసులను వేగవంతంగా విచారించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది.

ఈ ఏడాది 254మంది హిందువుల హత్య: వీహెచ్‌పీ

న్యూఢిల్లీ, అక్టోబరు 4: హిందువులపై మతపరమైన ప్రేరేపిత దాడుల కేసులను వేగవంతంగా విచారించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. మదర్సాలపై నిబంధనలను కఠినతరం చేయాలని కోరింది. సున్నితమైన ప్రాంతాల్లోని మసీదులు, మదర్సాలపై అత్యధిక రిజల్యూషన్‌ ఉన్న కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే దేశవ్యాప్తంగా 254 మంది హిందువులు జిహాదీల చేతిలో హత్యకు గురయ్యారని తెలిపింది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీహెచ్‌పీ సంయుక్త ప్రధానకార్యదర్శి సురేంద్ర జైన్‌ ఆ 254 కేసులకు సంబంధించి 26 పేజీల నివేదికను విడుదల చేశారు.

Updated Date - Oct 05 , 2026 | 05:54 AM