వెనెజువెలా చమురుతో భారీ లబ్ధి
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:45 AM
వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్‌కు భారీ లబ్ధి చేకూరుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) పరిశోధనలో పేర్కొంది.
300 బిలియన్ డాలర్ల మేరకు ఆదా
ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్‌కు భారీ లబ్ధి చేకూరుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) పరిశోధనలో పేర్కొంది. ఒక్కొక్క బ్యారెల్‌కు 10-12 డాలర్ల మేరకు స్థిరమైన తగ్గింపు ఉంటుందని, ఫలితంగా 300 బిలియన్ డాలర్ల మేరకు ఆదా అవుతుందని తెలిపింది. రాయితీపై కొనుగోలు చేస్తున్న రష్యా చమురును తగ్గించినప్పటికీ వెనిజువెలాతో మేలు కలుగుతుందని పేర్కొంది. దేశ వార్షిక ముడి చమురు దిగుమతి బిల్లులో 300 బిలియన్ డాలర్ల మేరకు తగ్గుతుందని తెలిపింది. చమురు దిగుమతిలో ఇదొక వ్యూహాత్మక మలుపుగా ఎస్‌బీఐ అభివర్ణించింది. ప్రస్తుతం రష్యా 60 డాలర్లకు బ్యారెల్ చమురు విక్రయిస్తోందని, వెనెజువెలా క్రూడాయిల్ బ్యారెల్ ఽధర 51 డాలర్లుగా ఉందని తెలిపింది. వాణిజ్య వ్యూహాలలో భాగంగా ఒక్కరిపైనే ఆధారపడకుండా వైవిధ్య భరితమైన మార్పుతో దీర్ఘకాలిక విజయం సాధించవచ్చని తెలిపింది.