Share News

విజయన్‌తో సతీశన్‌ భేటీ

ABN , Publish Date - May 16 , 2026 | 03:53 AM

కేరళ కొత్త సీఎంగా ఎంపికైన వి.డి. సతీశన్‌ తాత్కాలిక ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. సతీశన్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రి...

విజయన్‌తో సతీశన్‌ భేటీ

తిరువనంతపురం, మే 15: కేరళ కొత్త సీఎంగా ఎంపికైన వి.డి. సతీశన్‌ తాత్కాలిక ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. సతీశన్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ఆయన వరుసగా సీనియర్‌ నేతలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరువనంతపురంలోని పినరయి విజయన్‌ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించారు. అనంతరం తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా విజయన్‌ను సతీశన్‌ ఆహ్వానించారు. ఈనెల 18న ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది.

Updated Date - May 16 , 2026 | 03:53 AM