మదర్సాలలో ‘వందేమాతరం’ పాడాల్సిందే
ABN , Publish Date - May 22 , 2026 | 03:39 AM
పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో వందేమాతరం గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్‌లో సువేందు సర్కారు ఉత్తర్వులు
కోల్‌కతా, మే 21: పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో వందేమాతరం గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మదర్సాల్లో రోజువారీ తరగతులు ప్రారంభించడానికి ముందు నిర్వహించే ప్రార్థనా సమావేశాల్లో ‘వందేమాతరం’ పాడాలని పేర్కొంది. కాగా, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వందేమాతరం పాడటాన్ని తప్పనిసరి చేస్తూ మే 13న బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.