Share News

బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ యాత్రల నిలిపివేత

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:59 AM

హిమాలయాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..

బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ యాత్రల నిలిపివేత

  • భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయం

డెహ్రాడూన్‌, మే 31: హిమాలయాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని, వాతావరణం అనుకూలించి, మార్గం సురక్షితంగా మారిన తర్వాతే యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులను ప్రస్తుతానికి శ్రీనగర్‌ వద్ద నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు అక్కడ ఏర్పాటు చేసిన విడిది కేంద్రాల్లో భక్తులు వేచి ఉండాల్సిందిగా కోరారు. మరోవైపు చంపావత్‌ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న 50 మందికి పైగా యాత్రికులను ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి.

Updated Date - Jun 01 , 2026 | 03:59 AM