దివ్యాంగుల కోటాలో నీట్ సీటు కోసం
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:19 AM
ఎంబీబీఎస్ సీటు పొందేందుకు రెండుసార్లు నీట్ రాసినా అర్హత సాధించకపోవడంతో ఆ విద్యార్థి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లో కాలి వేళ్లు నరుక్కున్న విద్యార్థి!
న్యూఢిల్లీ, జనవరి 23: ఎంబీబీఎస్ సీటు పొందేందుకు రెండుసార్లు నీట్ రాసినా అర్హత సాధించకపోవడంతో ఆ విద్యార్థి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. దివ్యాంగుల కోటాలోనైనా అర్హత సాధించాలని తన కుడి కాలి వేళ్లు, ఆ పైభాన్ని తొలగించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. విద్యార్థి పేరు సూరజ్(20). తన పాదానికి తానే మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకొని, ప్రత్యేక పరికరంతో కాలి వేళ్లను కోసి.. తొలగించేశాడు! తర్వాత, ఇద్దరు దుండగులు దాడిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా సూరజ్ నిజం ఒప్పుకొన్నాడు.