Share News

యూపీలో వర్ష బీభత్సం

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:34 AM

ఉత్తరప్రదేశ్‌(యూపీ)లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

యూపీలో వర్ష బీభత్సం

  • మూడు రోజుల్లో 56 మంది మృత్యువాత

లఖ్‌నవూ, సెప్టెంబరు 27 : ఉత్తరప్రదేశ్‌(యూపీ)లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 46 మంది గాయపడ్డారు. 1,021 ఇళ్లు దెబ్బతిన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కదలికల ప్రభావంతో యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. చాలా జిల్లాల్లో సాధారణం కంటే రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో 66.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇదిలా ఉండగా, నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో వర్షాలు, దట్టమైన మంచు కురుస్తుండగా.. మనాంగ్‌ జిల్లాలోని హిమలుంగ్‌ హిమాల్‌ పర్వతాల్లో హిమపాతం సంభవించింది. ఈ హిమపాతంలో 10 మంది గల్లంతయ్యారు. ఈ పది మందిలో పర్వతారోహకులు, సహాయక సిబ్బంది ఉన్నారు. సముద్ర మట్టానికి 7126 మీటర్ల ఎత్తున ఉండే ఈ పర్వతాల్లో ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 05:36 AM