Share News

యూపీలో క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్సలు విఫలమై 9 మంది కళ్లు తీసేశారు

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:51 AM

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు విఫలమై దాదాపు 18మంది చూపు కోల్పోయారు.

యూపీలో క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్సలు విఫలమై 9 మంది కళ్లు తీసేశారు

గోరఖ్‌పూర్‌, ఫిబ్రవరి 19: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు విఫలమై దాదాపు 18మంది చూపు కోల్పోయారు. ఇందులో 9 మంది కళ్లను వైద్యులు పూర్తిగా తొలగించగా మరో 9మంది కన్ను ఉన్నా చూపు మాత్రం పోయింది. గోరఖ్‌పూర్‌లోని న్యూరాజేశ్‌ హైటెక్‌ ఆస్పత్రిలో ఫిబ్రవరి 1న నిర్వహించిన వైద్య శిబిరంలో 30 మంది రోగులకు క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు చేశారు. కొద్ది గంటలకే శస్త్రచికిత్స జరిగిన కంటిలో నొప్పి, నీరు కారడం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందిపడ్డారు. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డ 18మందిని గుర్తించి ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా ఉండేందుకు 9మంది బాధితులకు శస్త్రచికిత్స జరిగిన కన్నును వైద్యులు తొలగించారు.

Updated Date - Feb 20 , 2026 | 02:51 AM