ఎర్రసముద్రం నుంచి గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వెనక్కి!
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:51 AM
ఇరాన్ సమీపంలో మోహరించిన అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎర్రసముద్రం నుంచి వెనుదిరిగింది.
మరమ్మతుల కోసం క్రెటెలోని యూఎస్ నేవీ స్థావరానికి..
న్యూఢిల్లీ, మార్చి 19: ఇరాన్ సమీపంలో మోహరించిన అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎర్రసముద్రం నుంచి వెనుదిరిగింది. ఈ నౌకలో ఇటీవల మంటలు చెలరేగిన నేపథ్యంలో మరమ్మతుల నిమిత్తం గ్రీస్‌కు ప్రయాణించనుంది. క్రెటె ద్వీపంలోని యూఎస్ నేవీ స్థావరానికి దీనిని తరలించనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. వారం క్రితం గెరాల్డ్‌లోని ప్రధాన లాండ్రీలో మంటలు ఎగసిపడిన ఘటనలో ముగ్గురు నావికులకు గాయాలయ్యాయి. 600 మందికి పైగా నావికులు, సిబ్బంది పడకలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే నౌకలోని ప్రొపల్షన్ ప్లాంట్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, విమాన వాహక నౌక పూర్తిస్థాయిలో పనిచేస్తోందని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఘటన జరిగిన సమయంలో నౌకలో 4,500 మంది సిబ్బంది ఉన్నారు.