Share News

2 లక్షల మంది వలస ట్రక్‌ డ్రైవర్ల లైసెన్స్‌కు ముప్పు

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:16 AM

అగ్రరాజ్యం అమెరికాలో వాణిజ్య ట్రక్‌ లైసెన్స్‌ను పొందడానికి సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం చేశారు.

2 లక్షల మంది వలస ట్రక్‌ డ్రైవర్ల లైసెన్స్‌కు ముప్పు

  • అమెరికాలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన ఫలితం

న్యూఢిల్లీ, మార్చి 17: అగ్రరాజ్యం అమెరికాలో వాణిజ్య ట్రక్‌ లైసెన్స్‌ను పొందడానికి సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం చేశారు. దీంతో భారీగా వలస ట్రక్‌ డ్రైవర్లు లైసెన్స్‌లను కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. అమెరికా పౌరులు కాని వారు వాణిజ్య డ్రైవర్‌ లైసెన్స్‌ (సీడీఎల్‌)ను పొందడాన్ని పరిమితం చేసేలా యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టాన్స్‌పోర్టేషన్‌ (డీవోటీ) తెచ్చిన నిబంధన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో వచ్చే రెండేళ్లకాలంలో దాదాపు 2 లక్షల మంది వలసవచ్చిన డ్రైవర్లు లైసెన్స్‌ను కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘కొత్త నిబంధనతో సురక్షితం కాని విదేశీ డ్రైవర్లు తమ లైసెన్స్‌ను రెన్యువల్‌ చేసుకోకుండా నిరోధించవచ్చు. అలాగే సక్రమంగా జారీ చేయని లైసెన్స్‌ను రద్దు చేసేలా రాష్ట్రాలను బాధ్యులను చేయవచ్చు’’ అని డీవోటీ సెక్రటరీ సీన్‌ డఫీ పేర్కొన్నారు. కొత్త నిబంధన ప్రకారం కొన్ని కేటగిరీలకు చెందిన విదేశీ డ్రైవర్లు మాత్రమే కమర్షియల్‌ డ్రైవర్‌ లైసెన్స్‌ను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో హెచ్‌-2ఏ వీసాదారులు (సీజనల్‌ అగ్రికల్చర్‌ వర్కర్లు), హెచ్‌-2బీ వీసాదారులు (సీజనల్‌ నాన్‌ అగ్రికల్చరల్‌ వర్కర్లు), ఈ-2వీసాదారులు (ఒప్పంద పెట్టుబడిదారులు) ఉన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 04:16 AM