Share News

ఇరాన్‌ యురేనియం స్వాధీనానికి అమెరికా వ్యూహం

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:04 AM

ఇరాన్‌లోని శుద్ధికేంద్రాల్లో నిల్వ ఉన్న యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికోసం అధ్యక్షుడు ట్రంప్‌ నేతృత్వంలో ఆ దేశ మిలిటరీ...

ఇరాన్‌ యురేనియం స్వాధీనానికి అమెరికా వ్యూహం

  • వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌2: ఇరాన్‌లోని శుద్ధికేంద్రాల్లో నిల్వ ఉన్న యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికోసం అధ్యక్షుడు ట్రంప్‌ నేతృత్వంలో ఆ దేశ మిలిటరీ ఓ ప్రణాళికను రచించింది. ఇస్ఫహాన్‌, నతాంజ్‌ వంటి యురేనియం శుద్ధి కేంద్రాల్లో నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అత్యంత ప్రమాదకర ప్రణాళికను సిద్ధం చేసిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది. ఆ ప్రణాళిక ప్రకారం వందలు లేదా వేలాది సైనిక బృందాలను ఇరాన్‌లో మోహరిస్తారని పేర్కొంది. ఇది సంక్లిష్టమైన, గతంలో ఎన్నడూ చేయని ఆపరేషన్‌. ఇస్ఫహాన్‌, నతాంజ్‌ స్థావరాలపై గతంలో చేసిన దాడుల సమయంలో చాలా వరకు సామగ్రి శిథిలాల కింద ఉండిపోయింది. ఇప్పుడు అక్కడకి చేరడం కష్టతరం. ఈ కేంద్రాల నుంచి 1000 పౌండ్ల (సుమారు 450 కిలోలు)కు పైగా రేడియోధార్మిక పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడం యూఎస్‌ ప్రణాళికలో భాగం.

Updated Date - Apr 03 , 2026 | 04:04 AM