రష్యా చమురుపై మరోసారి ఆంక్షల సడలింపు
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:45 AM
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో మార్చి 12నాటికి ట్యాంకర్లలోకి నింపిన రష్యా చమురు,..
న్యూఢిల్లీ, మార్చి 20: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో మార్చి 12నాటికి ట్యాంకర్లలోకి నింపిన రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలపై అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ఒక కొత్త సాధారణ లైసెన్స్‌ను జారీ చేసింది. మార్చి 12న జారీ చేసిన 30 రోజుల ఆంక్షల మినహాయింపు స్థానంలో జారీ చేసిన ఈ లైసెన్స్ ఏప్రిల్ 11 వరకూ అమలులో ఉంటుంది. గత లైసెన్స్‌లోని నిబంధనలు యథాతథంగా ఉన్నప్పటికీ ఉత్తర కొరియా, క్యూబా, క్రిమియాకు సంబంధించిన లావాదేవీలను మినహాయించారు. పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడంతో పాటు ప్రపంచ మార్కెట్‌లోకి నిరాటంకంగా చమురు సరఫరాను కొనసాగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు.