Share News

గ్రీన్‌కార్డ్‌ లాటరీకి చెల్లు..మెరిట్‌ వ్యవస్థ అమలు

ABN , Publish Date - May 02 , 2026 | 05:57 AM

అమెరికా వలస విధానంలో సమూల మార్పులు తీసుకొస్తూ అలబామా రిపబ్లికన్‌ ప్రతినిధి బారీ మూర్‌ కొత్త బిల్లును ప్రతిపాదించారు. వీసా లాటరీ విధానాన్ని...

గ్రీన్‌కార్డ్‌ లాటరీకి చెల్లు..మెరిట్‌ వ్యవస్థ అమలు

  • ‘అమెరికన్స్‌ ఫస్ట్‌ ఇమిగ్రేషన్‌ యాక్ట్‌’ బిల్లులో ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, మే 1: అమెరికా వలస విధానంలో సమూల మార్పులు తీసుకొస్తూ అలబామా రిపబ్లికన్‌ ప్రతినిధి బారీ మూర్‌ కొత్త బిల్లును ప్రతిపాదించారు. వీసా లాటరీ విధానాన్ని రద్దుచేసి, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల స్థానంలో పాయింట్ల ఆధారిత మెరిట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని అందులో సూచించారు. కుటుంబ స్పాన్సర్‌షి్‌పను జీవిత భాగస్వాములు, వారి మైనర్‌ పిల్లలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఈ నిబంధనతో వీసాదారుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, వయోజనులైన పిల్లలకు అవకాశం లేకుండా పోతుందని ‘ఫ్యాక్స్‌ న్యూస్‌’ నివేదించింది. ట్రంప్‌ ప్రతిపాదించిన ‘అమెరికన్స్‌ ఫస్ట్‌’ వలస విధానానికి ఈ బిల్లు దగ్గరగా ఉందని పేర్కొంది. పాయింట్ల ఆధారిత మెరిట్‌ వ్యవస్థలో భాగంగా వయసు, విద్యార్హతలు, సైన్యంలో చేసిన సేవ, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, జీతం తదితర అంశాల ఆధారంగా పాయింట్లు కేటాస్తారు.

Updated Date - May 02 , 2026 | 05:57 AM