Share News

120కి పైగా బయో ల్యాబ్‌లకు అమెరికా నిధులు

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:38 AM

ఉక్రెయిన్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లోని 120కి పైగా బయోలాజికల్‌ ల్యాబొరేటరీలకు గత ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని...

120కి పైగా బయో ల్యాబ్‌లకు అమెరికా నిధులు

  • 30కి పైగా దేశాలకు గత బైడెన్‌ సర్కారు ఆర్థిక సాయం

న్యూఢిల్లీ, జూన్‌ 14: ఉక్రెయిన్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లోని 120కి పైగా బయోలాజికల్‌ ల్యాబొరేటరీలకు గత ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని అమెరికా డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ (డీఎన్‌ఐ) డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ తెలిపారు. డీక్లాసిఫైడ్‌ చేసిన నిఘా పత్రాల విడుదల సందర్భంగా ఆమె ఈ కీలక సమాచారం వెల్లడించారు. ఈ ల్యాబ్‌ల్లో అత్యంత ప్రమాదకరమైన, అంటువ్యాధులను కలిగించే వైర్‌సలు, బ్యాక్టీరియాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. పరిమిత పర్యవేక్షణతో కూడిన గెయిన్‌-ఆ్‌ఫ-ఫంక్షన్‌ పరిశోధనలు కూడా కొన్నిచోట్ల జరిగి ఉండొచ్చని నిఘా నివేదికలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌ వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రయోగశాలలు రష్యాతో యుద్ధం నేపథ్యంలో దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని డీఎన్‌ఐ కార్యాలయం హెచ్చరించింది.

Updated Date - Jun 15 , 2026 | 03:38 AM