Share News

India urea imports: తగ్గిన యూరియా ఉత్పత్తి..రెట్టింపైన దిగుమతి

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:06 AM

దేశీయంగా ఉత్పత్తి తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి 8 నెలల్లో విదేశాల నుంచి యూరియా దిగుమతులు రెట్టింపు పెరిగాయి...

India urea imports: తగ్గిన యూరియా ఉత్పత్తి..రెట్టింపైన దిగుమతి

న్యూఢిల్లీ, జనవరి 5: దేశీయంగా ఉత్పత్తి తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి 8 నెలల్లో విదేశాల నుంచి యూరియా దిగుమతులు రెట్టింపు పెరిగాయి. 2025 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకూ 7.17 మిలియన్‌ టన్నుల యూరియా దిగుమతైందని భారత ఫర్టిలైజర్ల సంఘం (ఎఫ్‌ఏఐ) సోమవారం తెలిపింది. 2024-25 ఏప్రిల్‌-నవంబరు మధ్య యూరియా దిగుమతి 3.26 మిలియన్‌ టన్నులతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దిగుమతి 120.3ు ఎక్కువ. దేశీయంగా 2024-25తో పోలిస్తే యూరియా ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో 25.40 మిలియన్‌ టన్నుల నుంచి 19.75మిలియన్‌ టన్నుల (2.3ు)కు పడిపోయింది.

Updated Date - Jan 06 , 2026 | 01:06 AM