Digital Face Authentication: యూపీఎస్సీ పరీక్ష కేంద్రాల వద్ద డిజిటల్ రూపంలో అభ్యర్థుల ముఖగుర్తింపు
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:00 AM
పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇక అభ్యర్థులకు డిజిటల్ రూపంలో ముఖగుర్తింపును తప్పనిసరి చేయనుంది.
న్యూఢిల్లీ, జనవరి 10: పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇక అభ్యర్థులకు డిజిటల్ రూపంలో ముఖగుర్తింపును తప్పనిసరి చేయనుంది. ఇందుకోసం ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కూడా ‘ఫేస్ అఽథంటికేషన్’ టెస్ట్‌ను నిర్వహిస్తామని శనివారం అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా గురుగ్రాంలోని పలు పరీక్ష కేంద్రాల వద్ద ఈ టెస్ట్‌ను నిర్వహించగా సత్ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ, కంబైండ్ డిఫెన్స్ అకాడమీ పరీక్షల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేశారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫారాల్లో పొందుపరిచిన ఫొటోలతో వారి ముఖాలు సరిపోయిందీ లేనిదీ డిజిటల్ విధానంలో తనిఖీ చేస్తారు.