Share News

పేపర్ల వారీగా సివిల్స్‌ అభ్యర్థుల మార్కులు

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:18 AM

సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల మార్కులను పేపర్ల వారీగా ప్రచురించే విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ)కు కేంద్ర..

పేపర్ల వారీగా సివిల్స్‌ అభ్యర్థుల మార్కులు

  • డీవోపీటీకి కేంద్ర సమాచార కమిషన్‌ సిఫారసు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల మార్కులను పేపర్ల వారీగా ప్రచురించే విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ)కు కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) సిఫారసు చేసింది. 2018 నుంచి ఈ విధానాన్ని నిలిపివేయడానికి సంబంధించి అధికారిక నిర్ణయం తీసుకున్నట్లుగా డీవోపీటీ వద్ద ఎలాంటి రికార్డులు లేవని కమిషన్‌ గుర్తించింది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికతను నిర్ధారించడానికి, అభ్యర్థులు తమ ప్రతిభను అంచనా వేసుకోవడానికి వీలుగా మార్కుల వివరాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. 2023కు ముందు పదేళ్ల కాలానికి సంబంధించి సివిల్స్‌ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్‌ పేపర్లు, పర్సనాలిటీ టెస్ట్‌ మార్కుల పూర్తి వివరాలు ఇవ్వాలని ఓ దరఖాస్తుదారు ఆర్టీఐ ద్వారా కోరారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారు కోరిన సమాచారం అందించాలని డీవోపీటీని సీఐసీ ఆదేశించింది.

Updated Date - Sep 25 , 2026 | 06:20 AM