పరీక్ష కేంద్రం ఎంపికలో దివ్యాంగులకు సౌలభ్యం: యూపీఎస్సీ
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:47 AM
దివ్యాంగ అభ్యర్థుల (పీడబ్ల్యూబీడీ) కోసం యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి పరీక్ష కేంద్రాల కేటాయింపు విధానాన్ని సవరించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దివ్యాంగ అభ్యర్థుల (పీడబ్ల్యూబీడీ) కోసం యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి పరీక్ష కేంద్రాల కేటాయింపు విధానాన్ని సవరించింది. కొత్త విధానం ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్న దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష కేంద్రం సామర్థ్యంపై ఎలాంటి పరిమితి ఉండదు. సదరు కేంద్రం గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత కూడా ఈ విభాగంలోని వారు దాన్ని ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అదే సమయంలో నాన్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రం ఈ అవకాశం ఉండదని యూపీఎస్సీ తెలిపింది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వారు కోరుకున్న కేంద్రాన్ని కేటాయించడంలో భాగంగా అవసరమైనచోట దాని సామర్థ్యాన్ని పెంచుతామని పేర్కొంది.