Share News

దుబాయ్‌, సింగపూర్‌లలో యూపీఐ చెల్లింపులకు వీలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:05 AM

దుబాయ్‌, సింగపూర్‌లకు వెళ్లే భారత పర్యాటకులు అక్కడి సందర్శనీయ కేంద్రాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చని శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

దుబాయ్‌, సింగపూర్‌లలో యూపీఐ చెల్లింపులకు వీలు

న్యూఢిల్లీ, అక్టోబరు 30: దుబాయ్‌, సింగపూర్‌లకు వెళ్లే భారత పర్యాటకులు అక్కడి సందర్శనీయ కేంద్రాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చని శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా, సింగపూర్‌లోని యూనివర్సల్‌ స్టూడియోస్‌, సింగపూర్‌ ఓషనేరియం, అండ్వంచర్‌ కోవ్‌ వాటర్‌ పార్క్‌ వంటి సందర్శనీయ ప్రాంతాల టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా యూపీఐ సాయంతో బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌ సందర్శనన టిక్కెట్లను యూపీఐ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. సింగపూర్‌, యూఏఈలతో పాటు పది దేశాలు యూపీఐ ద్వారా చెల్లింపులను అంగీకరిస్తున్నాయి. 11వ దేశంగా ఉజ్బెకిస్థాన్‌ చేరే అవకాశం ఉంది.

Updated Date - Oct 31 , 2026 | 03:06 AM