Share News

గుడ్డుపై ఎక్స్‌పైరీ డేట్‌!

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:24 AM

ఇకపై గుడ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటి ఉత్పత్తి తేదీ, ఎక్స్‌పైరీ తేదీ తెలుసుకోవడం వినియోగదారులకు సులభతరం కానుంది.

గుడ్డుపై ఎక్స్‌పైరీ డేట్‌!

  • ఏప్రిల్‌ 1 నుంచి యూపీలో కొత్త నిబంధన

లఖ్‌నవూ, మార్చి 18: ఇకపై గుడ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటి ఉత్పత్తి తేదీ, ఎక్స్‌పైరీ తేదీ తెలుసుకోవడం వినియోగదారులకు సులభతరం కానుంది. ప్యాక్‌ చేసిన మందు బిళ్లల మాదిరిగానే, ఉత్తరప్రదేశ్‌లో విక్రయించే ప్రతి గుడ్డుపై ఉత్పత్తి తేదీ, గడువు ముగిసే తేదీ తప్పనిసరిగా ముద్రించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సాధారణంగా గుడ్లను పెట్టిన తేదీ నుంచి రెండు వారాలలోపు వినియోగించాలని, అదే కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసే గుడ్లను ఐదు వారాల వరకు వాడుకోవచ్చని యూపీ పశుసంవర్ధక శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్‌ వివరించారు. ఈ ముద్రణ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఫుడ్‌-గ్రేడ్‌ ఇంక్‌ మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచే గుడ్లకు గులాబీ రంగు సిరా, కోల్డ్‌ స్టోరేజీలో భద్రపరిచే గుడ్లకు నీలం రంగు సిరాను వాడాలని స్పష్టం చేసింది.

Updated Date - Mar 19 , 2026 | 06:24 AM