Share News

బక్రీద్‌ రోజు రోడ్లపై నమాజ్‌ చేయవద్దు: యూపీ

ABN , Publish Date - May 26 , 2026 | 04:02 AM

బక్రీద్‌(ఈ నెల 28) సందర్భంగా ఎవరూ రోడ్లపై నమాజ్‌ చేయవద్దని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో జంతు ...

బక్రీద్‌ రోజు రోడ్లపై నమాజ్‌ చేయవద్దు: యూపీ

ప్రయాగ్‌రాజ్‌, మే 25: బక్రీద్‌(ఈ నెల 28) సందర్భంగా ఎవరూ రోడ్లపై నమాజ్‌ చేయవద్దని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో జంతు వధ నిర్వహించవద్దని స్పష్టం చేసింది. బక్రీద్‌ పండుగను పూర్తిగా చట్టబద్ధంగా, నిబంధనలకు లోబడి, సంప్రదాయ పరిమితుల్లోనే నిర్వహించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. జంతువధతో పాటు మాంసాన్ని బహిరంగంగా విక్రయించడంపైనా నిషేధం విధించారు. లైసెన్స్‌ ఉన్న జంతు వధశాలలు కూడా నిర్దిష్ట పరిమితికి మించి మాంసం నిల్వ చేయడానికి వీల్లేదని యోగి స్పష్టం చేశారు. దీన్ని బట్టి నిర్దేశిత ప్రాంతాల్లో ప్రజలు జంతువులను బలి ఇవ్వవచ్చునని అధికారులు తెలిపారు. నమాజ్‌ పేరుతో రోడ్లను బ్లాక్‌ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. .

Updated Date - May 26 , 2026 | 04:02 AM