Share News

సీట్ల సంఖ్య కన్నా గెలుపు ముఖ్యం

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:54 AM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ అనుసరించాల్సిన వైఖరిని అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ సూచన ప్రాయంగా తెలిపారు.

సీట్ల సంఖ్య కన్నా గెలుపు ముఖ్యం

  • యూపీ ఎన్నికలపై రాహుల్‌..నేడు ఎస్పీతో కాంగ్రెస్‌ చర్చలు

న్యూఢిల్లీ, నవంబరు 16: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ అనుసరించాల్సిన వైఖరిని అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ సూచన ప్రాయంగా తెలిపారు. గౌరవప్రదమైన స్థానాల్లో పోటీ చేయడం ముఖ్యమే అయినప్పటికీ సీట్ల సంఖ్య కన్నా గెలుపునకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. విజయం సాధించే స్థానాలపై దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం లఖ్‌నవూలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటుపై తొలివిడత చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకొంది. వాస్తవ దృక్పథంతో ఆలోచించి పార్టీ బలంగా ఉన్న స్థానాలను ఎంచుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ 181 స్థానాలు అడుగుతున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లు ఉండడం గమనార్హం.

Updated Date - Nov 17 , 2026 | 02:55 AM