Share News

కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్‌

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:20 AM

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 181 స్థానాల్లో పోటీ చేయాలని కోరుకుంటోందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వెల్లడించారు.

కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్‌

న్యూఢిల్లీ, నవంబరు 15: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 181 స్థానాల్లో పోటీ చేయాలని కోరుకుంటోందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వెల్లడించారు. ఢిల్లీలో శనివారం జరిగిన హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చామని, ఎస్పీ, ఇండియా కూటమి కలిసికట్టుగా అధికార బీజేపీని ఓడిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు, ఓ కూటమిలో కొనసాగుతూ ఇతర పొత్తుల గురించి ఆలోచించబోనని బదులిచ్చారు. రానున్న ఎన్నికల్లో అయోధ్య రామాలయ విరాళాల చోరీ ప్రధానాంశంగా మారనుందన్నారు. కాగా, 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 2 సీట్లే గెలిచింది.

Updated Date - Nov 16 , 2026 | 03:21 AM