యూపీలో 31,328 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు
ABN , Publish Date - May 25 , 2026 | 05:01 AM
ఉత్తరప్రదేశ్‌లో ఉమ్మీద్ పోర్టల్‌లోని 31 వేలకుపైగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ర్టేషన్లను అధికారులు రద్దు చేశారు. భూమి రికార్డులు, యాజమాన్య వివరాలకు సంబంధించిన..
ఉమ్మీద్ పోర్టల్ నుంచి తొలగించిన ప్రభుత్వం
లఖ్‌నవూ, మే 24: ఉత్తరప్రదేశ్‌లో ఉమ్మీద్ పోర్టల్‌లోని 31 వేలకుపైగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ర్టేషన్లను అధికారులు రద్దు చేశారు. భూమి రికార్డులు, యాజమాన్య వివరాలకు సంబంధించిన డాక్యుమంట్లు, వాటిపై నమోదైన దావాలు పరిశీలించిన అనంతరం భారీవ్యత్యాసాలను గుర్తించినట్టు తెలిపారు. ఉమ్మీద్ పోర్టల్ నుంచి ఆ ఆస్తులను తొలగించారు. పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం భారీ వ్యత్యాసాలు, సాంకేతిక వైరుధ్యాలు గుర్తించామన్నారు. భూమి రికార్డులు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు సరిపోలకపోవడంతో అనేక క్లెయిమ్‌లను కూడా తిరస్కరించామని చెప్పా రు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌ఆస్తులను డిజిటలైజ్ చేసి, జియోట్యాగింగ్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభు త్వం ఉమ్మీద్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. యూపీలో మొత్తం 1,18,302 వక్ఫ్ ఆస్తుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేశారు. వాటి పరిశీలన చేపట్టిన ప్రభుత్వం వాటిలో ఇప్పటివరకు 31,328 ఆస్తుల రిజిస్ర్టేషన్లను రద్దు చేసింది. అవి వక్ఫ్ ఆస్తులేనం టూ దాఖలైన 31,192క్లెయిమ్‌లను కూడా పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారు. భూమి పత్రాలు, రెవెన్యూ రికార్డులను సరిపోల్చి చూసే సమయంలో భారీ వ్యత్యాసాలు గుర్తించామని తెలిపారు.