హోర్ముజ్‌లో బలప్రయోగం వద్దు
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:24 AM
హోర్ముజ్ జలసంధిని తెరిచే అంశంలో బలప్రయోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానం.....
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: హోర్ముజ్ జలసంధిని తెరిచే అంశంలో బలప్రయోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానం ‘రక్షణాత్మక చర్యలకే’ పరిమితమైంది. బలప్రయోగానికి అనుమతిపై చైనా, రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీర్మానానికి బహ్రెయిన్ సవరణలు చేసింది. దీని ప్రకారం.. జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలను రక్షించుకునేందుకు మాత్రమే అవసరమైన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకట్రెండు రోజుల్లో భద్రతా మండలి ఈ సవరణ తీర్మానంపై చర్చ జరపనుంది.