Share News

ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరణ

ABN , Publish Date - May 20 , 2026 | 02:47 AM

ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు మంగళవారం స్థానిక కోర్టు నిరాకరించింది..

ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరణ

న్యూఢిల్లీ, మే 19: ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు మంగళవారం స్థానిక కోర్టు నిరాకరించింది. ఆపరేషన్‌ చేయించుకోనున్న తల్లికి సేవలు చేసేందుకు, మరణించిన తన అంకుల్‌ స్మారకార్థం 40 రోజుల అనంతరం నిర్వహించే చెహలుం కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరగా అదనపు సెషన్స్‌ కోర్టు అందుకు అంగీకరించలేదు. ఆయన తల్లికి చిన్న ఆపరేషనే జరగనుండడం, మరణించిన ఆ అంకుల్‌ దగ్గర బంధువేమీ కాకపోవడంతో బెయిల్‌ ఇవ్వలేమంది.

Updated Date - May 20 , 2026 | 02:47 AM