Share News

క్రిమియా వంతెనపై ఉక్రెయిన్‌ దాడి

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:44 AM

రష్యా, క్రిమియా మధ్య కీలక రవాణా మార్గమైన క్రిమియా వంతెనపై ఉక్రెయిన్‌ మరోసారి డ్రోన్‌ దాడికి పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున కెర్చ్‌ జలసంధిపై ఉన్న యూర్‌పలోనే..

క్రిమియా వంతెనపై ఉక్రెయిన్‌ దాడి

  • రష్యా-క్రిమియా మధ్య రాకపోకలు బంద్‌

మాస్కో, నవంబరు 16: రష్యా, క్రిమియా మధ్య కీలక రవాణా మార్గమైన క్రిమియా వంతెనపై ఉక్రెయిన్‌ మరోసారి డ్రోన్‌ దాడికి పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున కెర్చ్‌ జలసంధిపై ఉన్న యూర్‌పలోనే అతి పొడవైన (19 కిలోమీటర్లు) ఈ వంతెనను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. దాడి నేపథ్యంలో వంతెనపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దాడిలో వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. మరోవైపు ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఉక్రెయిన్‌ ఏకంగా 1,300కు పైగా డ్రోన్లతో రష్యాపై దాడి చేసిందని, వాటిలో చాలా వరకు డ్రోన్లను కూల్చివేశామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్‌ దాడిగా పేర్కొంది. ట్రంప్‌, పుతిన్‌, జిన్‌పింగ్‌లు ఈనెల 19న చైనాలో భేటీ కానున్న నేపథ్యంలో తాజా దాడి కలకలం రేపింది.

Updated Date - Nov 17 , 2026 | 03:45 AM