Share News

సబ్సిడీతో ఏడాదికి 4 సిలిండర్లే!

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:53 AM

ప్రధానమంత్రి మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ వంటగ్యాస్‌ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం కుదించింది.

సబ్సిడీతో ఏడాదికి 4 సిలిండర్లే!

  • ఉజ్వల యోజన లబ్ధిదారులకు కోటా కుదింపు

న్యూఢిల్లీ, జూన్‌ 8: ప్రధానమంత్రి మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ వంటగ్యాస్‌ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం కుదించింది. ఇప్పటిదాకా ఏడాదికి సబ్సిడీతో తొమ్మిది చొప్పున అందిస్తున్న సిలిండర్లను నాలుగుకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 2016లో పీఎంయూవై పథకాన్ని ప్రారంభించగా.. తొలుత ఏటా సబ్సిడీతో 12 సిలిండర్లు ఇచ్చేవారు. గత ఏడాది ఈ సంఖ్యను తొమ్మిదికి కుదిస్తే.. తాజాగా నాలుగుకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పీఎంయూవై లబ్ధిదారులకు రూ.300 చొప్పున సబ్సిడీ ఇస్తుండటంతో వారికి నికరంగా రూ.642 మాత్రమే పడుతోంది. ఏడాది కోటా దాటితేవాఆరు సైతం పూర్తి ధర రూ.942 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Jun 09 , 2026 | 03:53 AM