నా పోరాటం కుల వివక్షపైనే..
ABN , Publish Date - May 16 , 2026 | 03:54 AM
సనాతన ధర్మంపై తాను చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు సమాజంలోని కుల వివక్ష...
‘సనాతన’ వ్యాఖ్యలపై ఉదయనిధి క్లారిటీ
చెన్నై, మే 15: సనాతన ధర్మంపై తాను చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు సమాజంలోని కుల వివక్ష, సామాజిక అసమానతలను ఉద్దేశించినవే తప్ప.. హిందూ మతానికి గానీ, ప్రజల దైవ విశ్వాసాలకు గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అణచివేతను వ్యతిరేకించడం, సమానత్వాన్ని కాపాడటమనే ద్రవిడ సిద్ధాంతాలనే తన వైఖరి ప్రతిబింబిస్తోందని ఉదయనిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక అసమానతలపై తాము చేస్తున్న పోరాటాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ఎగువ, దిగువ కులాలుగా విభిజించే వివక్షా పూరిత ఆచారాలను అంతమొందించాలన్నదే తన వాదనని ఆయన పేర్కొన్నారు.