Share News

ఉడాన్‌కు రూ.550 కోట్లు

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:40 AM

దేశంలో చిన్న నగరాలకూ విమాన సర్వీసులు నడిపేందుకు, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన...

ఉడాన్‌కు రూ.550 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో చిన్న నగరాలకూ విమాన సర్వీసులు నడిపేందుకు, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్‌ పథకానికి బడ్జెట్‌లో పెద్దగా నిధులు పెంచలేదు. గత ఏడాది రూ.540 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తం ఇంకా తక్కువకు రూ.434 కోట్లకు చేరింది. తాజా బడ్జెట్‌లో రూ.550 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాంతీయ అనుసంధానత లక్ష్యంతో 2016లో ప్రవేశపెట్టిన ఈ పథకానికి గతంతో పోలిస్తే నిధుల కేటాయింపు తగ్గింది.

Updated Date - Feb 02 , 2026 | 03:40 AM