Share News

ఉబర్‌లో ట్రిప్‌ వీడియో రికార్డింగ్‌

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:31 AM

ప్రముఖ ప్రయాణ సేవల సంస్థ ఉబర్‌ తమ కారు, బైక్‌ రైడర్లకు ఉపయుక్తంగా ఉండే పలు సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే..

ఉబర్‌లో ట్రిప్‌ వీడియో రికార్డింగ్‌

  • ప్రయాణికులతో వివాదం ఏర్పడితే సాక్ష్యంగా వినియోగం

న్యూఢిల్లీ, అక్టోబరు 29: ప్రముఖ ప్రయాణ సేవల సంస్థ ఉబర్‌ తమ కారు, బైక్‌ రైడర్లకు ఉపయుక్తంగా ఉండే పలు సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే సమయంలో ఆ రైడ్‌ను మొత్తం వీడియోగా చిత్రీకరించనున్నట్లు ఉబర్‌ ఇండియా, దక్షిణాసియా డైరెక్టర్‌ (సప్లై ఆపరేషన్స్‌) ఆదిత్య కపూర్‌ గురువారం ప్రకటించారు. ప్రయాణంలో ప్రయాణికులతో డ్రైవర్‌కు ఏదైనా వివాదం ఏర్పడితే.. దర్యాప్తు సంస్థలు ఈ వీడియోలను సాక్ష్యాలుగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ వీడియో రికార్డింగ్‌ మొత్తం ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుందని చెప్పారు. ఉబర్‌ సంస్థగానీ, డ్రైవర్‌గానీ దానిని చూడలేరని పేర్కొన్నారు. స్థానిక దర్యాప్తు సంస్థలు (ఎల్‌ఈఏ) నిబంధనల ప్రకారం కోరితే ఆ వీడియోలను అందజేస్తామని వెల్లడించారు. మరోవైపు తమ సంస్థలో పనిచేస్తున్న 20 లక్షల మంది డ్రైవర్లు, రైడర్లకు ఆదాయాలు పెంచేందుకు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇకపై తమ సంస్థలోని బైక్‌ రైడర్లు ఒక నగరం నుంచి మరో నగరానికి ఇంటర్‌సిటీ సర్వీసులు కూడా అందిస్తారని చెప్పారు. పార్సిల్‌, ఇతర బిజినెస్‌ డెలివరీ సేవలూ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. అయితే, ఇంటర్‌సిటీ సేవలు ప్రస్తుతం కొన్ని నగరాల్లోనే అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Oct 30 , 2026 | 02:33 AM