Share News

హోర్ముజ్‌ను దాటిన మరో 2 భారత ట్యాంకర్లు

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:36 AM

ఇరాన్‌- అమెరికా యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య 2 భారతీయ ఎల్‌పీజీ ట్యాంకర్లు హోర్మూజ్‌ జల సంధిని దాటగా, మరో 16 ట్యాంకర్లు సహా 433 ప్రపంచ దేశాల నౌకలు కూడా చిక్కుకున్నాయి.

హోర్ముజ్‌ను దాటిన మరో 2 భారత ట్యాంకర్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: ఇరాన్‌- అమెరికా యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య 2 భారతీయ ఎల్‌పీజీ ట్యాంకర్లు హోర్మూజ్‌ జల సంధిని దాటగా, మరో 16 ట్యాంకర్లు సహా 433 ప్రపంచ దేశాల నౌకలు కూడా చిక్కుకున్నాయి. 46,650 టన్నుల ఎల్‌పీజీతో కూడిన నౌక ‘గ్రీన్‌ సాన్వి’.. మంగళవారం భారత పోర్టుకు చేరుకోనుండగా, ఈ నెల 9న 15,500 టన్నుల ఎల్‌పీజీతో కూడిన నౌక ‘గ్రీన్‌ ఆశ’ తీరానికి చేరుకుంటుందని కేంద్ర నౌకాయానశాఖ అదనపు కార్యదర్శి ముకేశ్‌ మంగాల్‌ చెప్పారు. దీంతో గత ఫిబ్రవరి 28న ఇరాన్‌- అమెరికా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్మూజ్‌ మీదుగా భారత్‌కు 8 ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్లు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. భారత్‌ మారిటైమ్‌ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంకా జల సంధి ఆవలే ఒక ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌ ట్యాంకర్‌, 2 ఎల్‌పీజీ ట్యాంకర్లు (ఒక గ్యాస్‌ నింపిన ట్యాంకర్‌), ఆరు ముడి చమురు ట్యాంకర్లు (5 క్రూడ్‌ నింపినవి), మూడు కంటైనర్‌ ఓడలు, ఒక డ్రెడ్జర్‌, ఒక రసాయన ట్యాంకర్‌, రెండు బల్క్‌ నౌకలు చిక్కుకున్నాయి.

Updated Date - Apr 07 , 2026 | 04:36 AM