ముంబైలో రెండు విమానాల రెక్కలు ఢీ
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:19 AM
ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ముంబై, ఫిబ్రవరి 3: ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 2732 విమానం ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. అదే సమయంలో, హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న ఇండిగో విమానం (6ఈ 791) ల్యాండ్ అయి పార్కింగ్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో రెండు విమానాల రెక్కల చివరలు ఒకదానికొకటి తగిలాయి.