Price Hike: టీవీలు, ఫోన్ల ధరలు పెరుగుతాయ్!
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:46 AM
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా.. ఫోన్ మార్చాలనుకుంటున్నారా.. ల్యాప్‌టా్‌పను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేసేయండి.
న్యూఢిల్లీ, జనవరి 16: కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా.. ఫోన్ మార్చాలనుకుంటున్నారా.. ల్యాప్‌టా్‌పను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేసేయండి. రాబోయే రెండు నెలల్లో టీవీలు, ల్యాప్‌టా్‌పలు, స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. మైక్రో చిప్‌ల కొరత, ఫలితంగా వాటి ధరలు పెరగడం, ఏఐని అందిపుచ్చుకోవడం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నాయి. మైక్రో చిప్‌ల కొరత ప్రభావం ఇప్పటికే కంపెనీలపై తీవ్రంగా ఉందని వివరించాయి.కౌంటర్ పాయింట్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గడిచిన అక్టోబరుతో పోలిస్తే మైక్రోచి్‌పల ధరలు మార్చికల్లా 120ు పెరిగే అవకాశం ఉంది. దీంతో టీవీ, ఫోన్ల కంపెనీలు ధరలు పెం చక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ ప్రభావం ఇప్పటికే మొ దలైందని, అందుకే చాలా కంపెనీలు డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తగ్గిస్తున్నాయని నివేదిక వివరించింది. స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదల ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. ధరల పెరుగుదల కారణంగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు 10-12శాతం పడిపోవచ్చని అంచనా వేసింది.