Share News

తుర్కియే పాఠశాలలో విద్యార్థి కాల్పులు 9 మంది మృతి..13మందికి గాయాలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:27 AM

తుర్కియేలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ పాఠశాలలో 14 ఏళ్ల వయసు విద్యార్థి ఒకరు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల మూలంగా తొమ్మిది మంది మృతి చెందగా..

తుర్కియే పాఠశాలలో విద్యార్థి కాల్పులు 9 మంది మృతి..13మందికి గాయాలు

అంకారా, ఏప్రిల్‌ 15: తుర్కియేలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ పాఠశాలలో 14 ఏళ్ల వయసు విద్యార్థి ఒకరు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల మూలంగా తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 13 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. రిటైర్డ్‌ పోలీసు అధికారి అయిన తన తండ్రి తుపాకులతో ఆ విద్యార్థి పాఠశాలకు వచ్చి రెండు తరగతి గదుల్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్టు కహ్రామన్‌మరా్‌స ప్రావిన్షియల్‌ గవర్నర్‌ ముకెర్రెమ్‌ అన్లూయర్‌ చెప్పారు. అతని వద్ద ఐదు తుపాకులు, ఏడు మ్యాగజైన్లు ఉన్నాయని తెలిపారు. కాల్పులకు తెగబడిన విద్యార్థి కూడా మృతి చెందాడు. అయితే అతన్ని పోలీసులు చంపారా లేక తనను తానే కాల్చుకున్నాడా అన్నదానిపై స్పష్టతలేదు. కాగా రెండు రోజుల్లోనే తుర్కియేలో రెండోసారి ఇలాంటి కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మంగళవారం శాన్లియుర్ఫా ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో ఓ మాజీ విద్యార్థి కాల్పులు జరపడంతో 16 మంది గాయాలపాలయ్యారు.

Updated Date - Apr 16 , 2026 | 03:27 AM