వూహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులు..!
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:01 AM
కొవిడ్ వైరస్‌కు మూలకారణంగా భావిస్తున్న వూహాన్ ల్యాబ్‌కు అమెరికా అగ్రశ్రేణి శాస్త్రవేత్త, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసీ ...
తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ, జూన్ 19: కొవిడ్ వైరస్‌కు మూలకారణంగా భావిస్తున్న వూహాన్ ల్యాబ్‌కు అమెరికా అగ్రశ్రేణి శాస్త్రవేత్త, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసీ నిధులు సమకూర్చారని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెకర్(ఎన్‌ఐడీ) పదవి నుంచి వైదొలుగుతున్న తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. తన పదవీకాలం చివరి రోజైన గురువారం ఆమె ఇంతకు ముందెన్నడూ చూడని పత్రాలివిగో అంటూ వాటిని బయపెట్టారు. 2020లో కొవిడ్ వ్యాపించినప్పుడు బైడెన్ ప్రభుత్వానికి వైద్య సలహాదారుగా ఉన్న ఫౌసీ... వూహాన్ ల్యాబ్‌లో కరోనా వైర్‌సపై ప్రమాదకరమైన ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ (వైరస్‌ల జన్యు మార్పు) పరిశోధనలకు నిధులు సమకూర్చారని పేర్కొన్నారు. కరోనా వైరస్ లీకేజీ అంశంలోనూ వాస్తవాలను ఫౌసీ దాచిపెట్టారని ఆరోపించారు.