Share News

ఎన్డీఏ కూటమిలోకి టీటీవీ దినకరన్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:17 AM

అన్నాడీఎంకే బహిష్కృతనేత, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ బుధవారం ఎన్డీఏ కూటమిలో చేరారు..

ఎన్డీఏ కూటమిలోకి టీటీవీ దినకరన్‌

చెన్నై, జనవరి 21(ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే బహిష్కృతనేత, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ బుధవారం ఎన్డీఏ కూటమిలో చేరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బీజేపీతో జత కట్టింది. అనంతరం ఈ కూటమిలో అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే వర్గం చేరింది. ఈ క్రమంలో ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని అంగీకరించమంటూ ప్రకటనలు గుప్పించిన టీటీవీ దినకరన్‌ బుధవారం చెన్నైకి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం మద్దతుదారుడు, అన్నాడీఎంకే ఎమ్మెల్యే వైద్యలింగం డీఎంకేలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వైద్యలింగం, డీఎంకే కార్యాలయానికి వెళ్లి సీఎం ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Updated Date - Jan 22 , 2026 | 03:17 AM