Share News

ట్రంప్‌నకు తగ్గుతున్న ప్రజాదరణ!

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:31 AM

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా అధక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సొంత దేశంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అమెరికన్లలో..

ట్రంప్‌నకు తగ్గుతున్న ప్రజాదరణ!

  • అమెరికన్లలో గరిష్ఠ స్థాయికి వ్యతిరేకత

  • ఫాక్స్‌ న్యూస్‌ పోల్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 27: ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా అధక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సొంత దేశంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అమెరికన్లలో ట్రంప్‌కు ఆదరణ భారీగా పడిపోయిందని ఫాక్స్‌ న్యూస్‌ పోల్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశాధ్యక్ష పదవిని ట్రంప్‌ నిర్వహిస్తున్న తీరు పట్ల 59 శాతం మంది ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో 47 శాతం మంది ట్రంప్‌ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాగా, 41 శాతం మంది మాత్రం ట్రంప్‌ను సమర్థిస్తున్నట్లు చెప్పారు. అయితే ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన రెండు పర్యాయాల్లో ఆయన పట్ల అత్యధికంగా వ్యతిరేక అభిప్రాయం వెల్లడైంది ఇప్పుడే కావడం గమనార్హం. మొదటిసారి అధ్యక్ష పదవిని నిర్వహించిన సమయంలో అత్యధికంగా 2017 అక్టోబరులో 57 శాతం మందిలో మాత్రమే వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్‌ విదేశాంగ విధానం పట్ల కూడా అమెరికన్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఏకంగా 62 శాతం మంది ఆయన విదేశాంగ విధానం పట్ల పెదవి విరిచారు. ప్రత్యేకించి ఇరాన్‌తో ఘర్షణ విషయంలో ట్రంప్‌ వ్యవహార శైలిని 64ు మంది తప్పుబట్టారు. రాయిటర్స్‌ సర్వేలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.

Updated Date - Mar 28 , 2026 | 04:31 AM