మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:21 AM
స్వచ్ఛందంగా అమెరికాను వీడి వెళ్లే అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ మరోమారు ఆఫర్లు ప్రకటించింది. తమ దేశాలకు తిరిగి వెళ్లడానికి ఉచిత విమాన టికెట్లతో పాటు 2,600 డాలర్లు...
అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ ఆఫర్లు
స్వచ్ఛందంగా అమెరికాను వీడితే విమాన టికెట్లు..2,600 డాలర్ల ఎగ్జిట్ బోనస్
తాజ్‌మహల్ చిత్రంతో ఎక్స్‌లో ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 18: స్వచ్ఛందంగా అమెరికాను వీడి వెళ్లే అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ మరోమారు ఆఫర్లు ప్రకటించింది. తమ దేశాలకు తిరిగి వెళ్లడానికి ఉచిత విమాన టికెట్లతో పాటు 2,600 డాలర్లు (సుమారు రూ. 2.41 లక్షలు) ఎగ్జిట్ బోన్‌సగా ఇస్తామని చెప్పింది. తాజ్‌మహల్‌తో పాటు కొలంబియా, చైనాలకు చెందిన ప్రముఖ ప్రదేశాల చిత్రాలతో ఎక్స్‌లో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్‌ఎస్) ఓ పోస్టు చేసి దానిలో ఆఫర్లను వివరించింది. కాగా, ఒక అక్రమ వలసదారుడిని బలవంతంగా తిరిగి వెనక్కి పంపించడానికి అమెరికాకు 18,245 డాలర్లు (సుమారు 16.92 లక్షలు) ఖర్చవుతోంది. సీబీపీ హోమ్ యాప్‌లో పేరు నమోదు చేసుకుని స్వచ్ఛందంగా వెళ్లే వారికి అగ్రరాజ్యం 2,600 డాలర్ల ఆఫర్ ప్రకటించింది.