Share News

ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా హిజ్రా

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:59 AM

తమిళనాడు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ (టీఎన్‌ఎస్‌టీసీ) బస్సు డ్రైవర్‌గా తొలిసారి ఓ హిజ్రా విధులు చేపట్టారు. పుదుకోట ప్రాంతీయ రవాణా...

ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా హిజ్రా

చెన్నై, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ (టీఎన్‌ఎస్‌టీసీ) బస్సు డ్రైవర్‌గా తొలిసారి ఓ హిజ్రా విధులు చేపట్టారు. పుదుకోట ప్రాంతీయ రవాణా సంస్థ పరిధిలో శ్రీదేవి అనే హిజ్రా డ్రైవర్‌గా చేరి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆరు మాసాలకు ముందు కళైయరసి అనే హిజ్రా తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్‌ కండెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. తాజాగా డ్రైవర్‌గా పనిలో చేరిన శ్రీదేవిని అందరూ అభినందిస్తున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 03:59 AM