Share News

ట్రాన్స్‌జెండర్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:49 AM

ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే..

ట్రాన్స్‌జెండర్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

  • అమలులోకి కొత్త చట్టం

న్యూఢిల్లీ, మార్చి 31: ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై స్వలింగ, లింగమార్పిడి తదితర సమూహాలకు (ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్‌) ప్రాతినిధ్యం వహించే సంస్థల నుంచేగాక, ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి ప్రధాన కారణం.. ట్రాన్స్‌జెండర్‌ గుర్తిం పు ప్రక్రియ వివాదాస్పదం కావటమే. అంతకుముందు, ఒక వ్యక్తి తనకు తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకుంటే సరిపోయేది. కొత్త చట్టం ప్రకా రం.. వైద్యపరీక్షలో నిర్ధారణ అనంతరం ధ్రువీకరణ పత్రం తీసుకుంటేనే ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు, ఎవరినైనా ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకునేందుకు ఒత్తిడి చేసినా, శారీరకంగా హింసించినట్లు తేలినా ఈ చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టటానికి ముందు కేంద్రం తమను సంప్రదించలేదని ఎల్‌జీబీజీక్యూఐఏ ప్లస్‌ సంస్థలు తెలిపాయి. ‘జాతీయ ట్రాన్స్‌జెండర్ల మండలి’ నుంచి ఇద్దరు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - Apr 01 , 2026 | 03:49 AM