మహాత్మాగాంధీ పేరునే కొనసాగించాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:17 AM
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరునే కొనసాగించాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఉపాధి హామీ పేరు మార్పుపై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరునే కొనసాగించాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శుక్రవారం ఉదయం ఈ తీర్మానాన్ని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద కేంద్రప్రభుత్వం తమిళనాడుకు అందించాల్సిన రూ.1,026 కోట్ల నిధులు విడుదల చేయలేదని తెలిపారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామి పథకం తమిళనాడులో చక్కగా అమలవుతోందని, 100 రోజుల ఉపాధి పథకం ద్వారా ఏటా సుమారు 65 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని తెలిపారు. ఈ తీర్మానం మూజువాణీ ఓటు ద్వారా ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు.