Share News

ఎన్సీపీఐలో టీఎంసీని విలీనం చేస్తాం

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:35 AM

నేషనలిస్ట్‌ సిటిజన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో టీఎంసీని విలీనం చేస్తామని అసమ్మతి ఎంపీలు తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో 20 మంది టీఎంసీ రెబల్‌ ...

ఎన్సీపీఐలో టీఎంసీని విలీనం చేస్తాం

  • లోక్‌సభ స్పీకర్‌కు టీఎంసీ అసమ్మతి ఎంపీల లేఖ

  • ఓం బిర్లాను కలిసిన 20 మంది రెబల్‌ ఎంపీలు

కోల్‌కతా, జూన్‌ 13: నేషనలిస్ట్‌ సిటిజన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో టీఎంసీని విలీనం చేస్తామని అసమ్మతి ఎంపీలు తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో 20 మంది టీఎంసీ రెబల్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తమ వద్ద మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని, ఎన్సీపీఐ (ఈసీ దగ్గర రిజిస్టరైనా గుర్తింపు పొందని పార్టీ)లో తమ పార్టీని విలీనం చేస్తామంటూ ఆయనకు లేఖను అందజేశారు. ఓం బిర్లాను కలిసిన వారిలో యూసుఫ్‌ పఠాన్‌, సయానీ ఘోష్‌, సుదీప్‌ బందోపాధ్యాయ తదితరులున్నారు. స్పీకర్‌తో సమావేశానంతరం తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న కాకోలీ ఘోష్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్డీయేకు మద్దతిస్తామని, ప్రధాని మోదీ నేతృత్వంలో కలిసి పనిచేస్తామని చెప్పారు. మరోవైపు అసమ్మతి ఎంపీలను టీఎంసీ ప్రత్యేక వర్గంగా చూడరాదంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత అభిషేక్‌ బెనర్జీ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

Updated Date - Jun 15 , 2026 | 03:35 AM