ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్ ఎంపీల భేటీ
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:49 AM
టీఎంసీలో తిరుగుబాటు చేసిన ఎంపీలు ఆదివారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారి కూడా హాజరవుతారు.
హాజరుకానున్న బెంగాల్ సీఎం సువేందు
కోల్‌కతా, జూన్ 13: టీఎంసీలో తిరుగుబాటు చేసిన ఎంపీలు ఆదివారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారి కూడా హాజరవుతారు. ఈ నెల 15న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో టీఎంసీ రెబల్ ఎంపీలు సమావేశమవుతారు. మరోవైపు టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. మరోవైపు టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. రెబల్ ఎంపీల లేఖపై సుదీప్ కూడా సంతకం చేయడంతో మొత్తం సంఖ్య 20కి చేరింది. సుదీప్‌తో పాటు టీఎంసీని వీడిన సయానీ ఘోష్ తదితర రెబల్ ఎంపీలను పార్టీ పదవులనుంచి మమత తొలగించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం కానుందని జరుగుతున్న ప్రచారాన్ని టీఎంసీ జాతీయ సంయుక్త కార్యదర్శి, సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్, ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ఖండించారు. అదంతా ఫేక్ ప్రచారమని, ఆ వార్తలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.
అభిషేక్ బెనర్జీకి మళ్లీ సీఐడీ సమన్లు
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సీఐడీ మరోమారు సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న హాజరుకావాలని ఆదేశించింది. అక్రమ లావాదేవీలకు సంబంధించి పీఏ సుమిత్ రాయ్ కోసం పోలీసులు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు అభిషేక్ బెనర్జీ నివాసంలో సోదాలు నిర్వహించారు. సమాచారం తెలియగానే అభిషేక్ నివాసానికి వచ్చిన మమత సోదాలు అయిపోయేవరకు అక్కడే ఉన్నారు.