ఉపఎన్నిక బరి నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి
ABN , Publish Date - May 20 , 2026 | 02:29 AM
పశ్చిమబెంగాల్‌లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ...
కోల్‌కతా, మే 19: పశ్చిమబెంగాల్‌లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇక్కడ మే 21న రీపోలింగ్ జరగాల్సి ఉండగా, ప్రచారం ముగిసే ఆఖరి రోజున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.నామినేషన్ ఉపసంహరణ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఫాల్తా ప్రాంత అభివృద్ధి కోసం సీఎం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఆకర్షితుడినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెంగాల్‌లో రెండోదశ ఎన్నికల సందర్భంగా.. ఫాల్తా నియోజకవర్గంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, ఇది జహంగీర్ సొంత నిర్ణయమని, పార్టీకి దీనితో సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.