Share News

‘టైమ్‌’ టాప్‌ 100లో సుందర్‌ పిచాయ్‌, రణబీర్‌

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:31 AM

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులతో టైమ్‌ మ్యాగజైన్‌ రూపొందించిన ‘2026 టాప్‌ 100’ జాబితా బుధవారం విడుదలైంది.

‘టైమ్‌’ టాప్‌ 100లో సుందర్‌ పిచాయ్‌, రణబీర్‌

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 15: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులతో టైమ్‌ మ్యాగజైన్‌ రూపొందించిన ‘2026 టాప్‌ 100’ జాబితా బుధవారం విడుదలైంది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతీయులతో పాటు భారతీయ మూలాలున్న ప్రముఖులు పెద్ద సంఖ్యల చోటు సంపాదించడం విశేషం. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌, స్టార్‌ షెఫ్‌ వికాస్‌ ఖన్నా ఈ ఘనత సాధించారు. తెలుగు మూలాలున్న ప్రముఖ వైద్యుడు కిరణ్‌ ముసునూరి సహా భారత సంతతికి చెందిన యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, న్యూయార్క్‌ సిటీ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీతో పాటు నేపాల్‌లో జరిగిన ‘జెన్‌జీ’ నిరసనల ద్వారా కేవలం 35 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బాలేంద్ర షా ఇందులో స్థానం దక్కించున్నారు.

Updated Date - Apr 16 , 2026 | 03:31 AM