Share News

Ticket Sales for Republic Day Parade: నేటి నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్ల విక్రయాలు

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:25 AM

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లు, సాంస్కృతిక, రక్షణ సామర్థ్యాల ప్రదర్శన కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనవరి 5 నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది...

Ticket Sales for Republic Day Parade: నేటి నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్ల విక్రయాలు

న్యూఢిల్లీ, జనవరి 4: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లు, సాంస్కృతిక, రక్షణ సామర్థ్యాల ప్రదర్శన కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనవరి 5 నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లలో ఈ నెల 14 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌, 28న బీటింగ్‌ ది రిట్రీట్‌ ఫుల్‌డ్రస్‌ రిహార్సల్‌, 29న ప్రధాన బీటింగ్‌ ది రిట్రీట్‌ కార్యక్రమాలను నిర్వహిస్తారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌ టికెట్ల ధరలను రూ.20, రూ.100గా అధికారులు నిర్ణయించారు. బీటింగ్‌ ది రిట్రీట్‌ రిహార్సల్‌ ధర రూ.20 కాగా, ప్రధాన బీటింగ్‌ ది రిట్రీట్‌ కార్యక్రమ ధర రూ.100గా ఉంది. టికెట్లను ఆన్‌లైన్‌లో ‘ఆమంత్రన్‌’ పోర్టల్‌ ద్వారా, ఆఫ్‌లైన్‌లో ఢిల్లీలోని నిర్దేశిత కౌంటర్ల ద్వారా ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డు చూపించి పొందవచ్చు.

Updated Date - Jan 05 , 2026 | 02:25 AM