యూకేకు భారతీయుల వీడ్కోలు!
ABN , Publish Date - May 23 , 2026 | 04:02 AM
కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న జీవన వ్యయాలకు తోడు ఉద్యోగాల మార్కెట్ బలహీనపడటంతో యూకే నుంచి పెద్దసంఖ్యలో విదేశీయులు ....
న్యూఢిల్లీ, మే 22: కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న జీవన వ్యయాలకు తోడు ఉద్యోగాల మార్కెట్ బలహీనపడటంతో యూకే నుంచి పెద్దసంఖ్యలో విదేశీయులు తరలిపోతున్నారు. ఈ జాబితాలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారని వెల్లడైంది. యూకేకి చెందిన ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్) గణాంకాల ప్రకారం.. చదువుల కోసం బ్రిటన్ వచ్చిన 51వేల మంది, ఉపాధి కోసం వచ్చిన 21వేల మంది, ఇతర కారణాలతో వచ్చిన మరో 3వేల మంది చొప్పున భారతీయులు గత సంవత్సరం దేశం విడిచి వెళ్లిపోయారు. తర్వాత స్థానాల్లో చైనా, పాకిస్థాన్, నైజీరియా, ఉక్రెయిన్ దేశస్థులు ఉన్నారు.